ప్రముఖ ఈకామర్స్ వెబ్సైట్ అమెజాన్ తన వినియోగదారులకు తన యాప్, వెబ్సైట్లో ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇందుకోసం ఐఆర్సీటీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. అమెజాన్ ఆండ్రాయిడ్ యాప్లతోపాటు అమెజాన్.ఇన్ వెబ్సైట్లోకూడా ఈ అవకాశం ఉంది. త్వరలో ఐవోఎస్ యాప్లో కూడా ఈ ఫీచర్ను తీసుకురాబోతోంది.
స్పెషల్ పేజ్
ట్రైన్ టికెట్స్ బుకింగ్ కోసం అమెజాన్ యాప్లో స్పెషల్ పేజీని క్రియేట్ చేసింది.
* అమెజాన్ పేను క్లిక్ చేసి మీకు కావాల్సిన ట్రైన్ డిటెయిల్స్ చూసుకుని టికెట్ బుక్ చేసుకోవచ్చు.
* యాప్ నుంచి నేరుగా పేమెంట్ గేట్వేకి వేళ్లి మనీ పే చేయొచ్చు.
* అమెజాన్ పే క్రెడిట్ ఉన్నా వాడుకోవచ్చు.
* టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలంటే మై ఆర్డర్స్ సెక్షన్లోకి వెళ్లి క్యాన్సిల్ చేసుకోవచ్చు
ఉపయోగాలు
* ఎలాంటి సర్వీసు ఛార్జీ ఉండదు.
* తొలి సారి అమెజాన్ ద్వారా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు 10% (గరిష్టంగా 100 రూపాయల) వరకు క్యాష్బ్యాక్ లభిస్తుంది.
* అమెజాన్ ప్రైమ్ మెంబర్లకయితే తొలిసారి టికెట్ బుక్ చేసుకున్నప్పుడు 12% (గరిష్టంగా 120 రూపాయల) వరకు క్యాష్బ్యాక్ లభిస్తుంది.
* ఈ క్యాష్బ్యాక్ ఆఫర్ కొంతకాలం వరకే పరిమితం
* బెర్త్ లభ్యత, పీఎన్ఆర్ స్టేటస్ చెక్ చేసుకో్వచ్చు.
అమెజానà±â€Œà°²à±‹ à°Ÿà±à°°à±ˆà°¨à± టికెటౠబà±à°•à°¿à°‚à°—à±â€Œ అమెజానౠà°à°†à°°à±â€Œà°¸à±€à°Ÿà±€à°¸à±€ టై à°…à°ªà±â€Œ అమెజానౠస‌రà±à°µà±€à°¸à±†à°¸à±â€Œ amazon India Amzon Train tickets booking Train Ticket booking in Amazon